breaking news
Ravikamatham
-
విశాఖ జిల్లాలో 220 కేజీల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా రావికమతం మండలం కల్యాణలోవలో అక్రమంగా తరలిస్తున్న 220 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి... ఇద్దరని పోలీసులు అరెస్ట్ చేసి.. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే మరో ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
నాటు తుపాకితో కాల్పులు: రైతుకు గాయాలు
రావికమతం (విశాఖపట్టణం) : గుర్తు తెలియని వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన విశాఖ జిల్లా రావికమతం మండలం గుడ్డిప గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇందల పెంటయ్య తన పొలానికి వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తి నాటుతుపాకీతో అతనిపైకి కాల్పులు జరిపాడు. దీంతో తీవ్రంగా గాయపడిన పెంటయ్యను మొదట అనకాపల్లి ఆస్పత్రికి అనంతరం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. భూ తగాదాల నేపథ్యంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని భావిస్తున్నారు.