రాజమండ్రిలో అగ్నిప్రమాదం | fire accident in rajamundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో అగ్నిప్రమాదం

Feb 20 2015 7:36 PM | Updated on Sep 5 2018 9:45 PM

రాజమండ్రి లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది.

రాజమండ్రి క్రైం: రాజమండ్రి లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటన రాజమండ్రిలోని ఆశోక థియేటర్ వెనక భాగంలో ఉన్న పూరింట్లో శుక్రవారం సాయంత్రం జరిగింది. ప్రమాదవశాత్తు గుడిసెకు మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న రెండు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది.

ఒక్కసారిగా మంటలు పెద్దఎత్తున ఎగిసి పడటంతో ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సమయానికి సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement