హోటల్లో సిలిండర్ల పేలుడు: భారీగా ఆస్తి నష్టం | Fire accident in Hotel at Koyyalagudem | Sakshi
Sakshi News home page

హోటల్లో సిలిండర్ల పేలుడు: భారీగా ఆస్తి నష్టం

Aug 5 2014 8:25 AM | Updated on Sep 5 2018 9:45 PM

పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలోని ఓ హోటల్లో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించింది.

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలోని ఓ హోటల్లో మంగళవారం తెల్లవారుజామున గ్యాస్ సిలిండర్లు పేలి అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికులు వెంటనే స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలార్పుతున్నారు. అయితే హోటల్ పక్కనే ఉన్న ఐదు దుకాణాలు కూడా ఆ అగ్నికి ఆహుతి అయ్యాయి. దాంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

Advertisement
 
Advertisement
Advertisement