రుణమాఫీ జాబితాపై రైతుల ఆగ్రహం | farmers protest in guntur district on loan waiver list | Sakshi
Sakshi News home page

రుణమాఫీ జాబితాపై రైతుల ఆగ్రహం

Dec 12 2014 3:48 PM | Updated on Jun 4 2019 5:04 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జాబితాపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలం గార్లపాడులో  రైతులు నిరసనకు దిగారు. రుణమాఫీ జాబితాలో అవకతవకలు జరిగాయని రైతులు ఆరోపించారు. బ్యాంకర్ల తీరును నిరసిస్తూ వారిని నిర్బంధించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల రుణమాఫీ జాబితాను విడుదల సంగతి తెలిసిందే. చాలామంది రైతులకు అన్యాయం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 50 వేల రూపాయలకు లోపు రుణం వారికి కూడా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వర్తింపజేశారని వార్తలు వచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement