'సీఎంగా తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదు' | farmers protest against debt relief scheme | Sakshi
Sakshi News home page

'సీఎంగా తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదు'

Dec 16 2014 1:38 PM | Updated on Oct 1 2018 2:00 PM

గ్రామాల్లో నిర్వహిస్తున్నరైతు సాధికారి సదస్సు పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుంటూరు: గ్రామాల్లో నిర్వహిస్తున్నరైతు సాధికారి సదస్సు పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ల ద్వారా వచ్చిన సమాచారాన్ని పత్రంలో చేర్చి రైతులకు అందజేయడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఆ రుణ విముక్తి పత్రాల వల్ల పైసా కూడా ఉపయోగం ఉండడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పిడుగురాళ్ల మండలం కోనంకిలో రైతు సాధికార సదస్సు నిర్వహించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఈ సదస్సు తమకొద్దంటూ బ్యానర్లు చించివేశారు.

 

'సీఎం తొలిసారి చేసిన సంతకమే చెల్లలేదని.. ఇక మీరిచ్చి బాండ్లు ఎలా చెల్లుతాయంటూ' రైతులు అధికారులను నిలదీశారు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా కార్యక్రమాన్ని ముగించుకుని అధికారులు వెనుదిరిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement