‘పచ్చ’డైపోతున్నాం! | Pawan Kalyan Faces Concerns From Jana Sena Party MLAs Over TDP Dominance In Alliance Government, More Details Inside | Sakshi
Sakshi News home page

‘పచ్చ’డైపోతున్నాం!

Mar 25 2026 9:04 AM | Updated on Mar 25 2026 10:13 AM

janasena mlas complain tdp dominance pawan kalyan meeting

తెలుగుదేశం కబంధ హస్తాల్లోనే జనసేన 

జనసేన ఎమ్మెల్యేలు ఉన్నా.. టీడీపీ నేతలదే పెత్తనం   

సీఎం కార్యాలయంలోనూ పనులు కావట్లేదు 

ఇదే తీరు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టమే 

 పవన్‌కళ్యాణ్‌ ఎదుట జనసేన ఎమ్మెల్యేల ఆవేదన   

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కబంధహస్తాల్లో జనసేన నలిగిపోతోందని.. నియోజకవర్గాల్లో టీడీపీ నేతలే పెత్తనం చేస్తున్నారని, తమకు ప్రాధాన్యం దక్కడం లేదని, పనులూ కావడం లేదని పార్టీ అధ్యక్షుడు పనవ్‌ కళ్యాణ్‌ ఎదుట జనసేన ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. 

విజయవాడలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్‌కళ్యాణ్‌ మంగళవారం నిర్వహించిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌), పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించడంతోపాటు నాయకుల నుంచి వేర్వేరుగా అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశి్చమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపులో జనసేన గెలిచిన నియోజకవర్గాలకు అన్యాయం జరుగుతోందని పవన్‌ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేన నేతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదని, ఇదే తీరు కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి నష్టం చేకూరుతుందని చెప్పినట్లు సమాచారం. 

మరోవైపు సీఎంఓలో తమ నియోజకవర్గం నుంచి వచ్చే వినతులు తొందరగా పరిష్కారానికి నోచుకోవడం లేదని, అదే సహచర టీడీపీ ఎమ్మెల్యేలకు వేగంగా పనులు జరుగుతున్నాయని వివరించినట్టు సమాచారం. జనసేనతోపాటు బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లోనూ ప్రభుత్వాఫీసుల్లో స్థానిక టీడీపీ నేతలు చెప్పే పనులు వేగంగా జరుగుతాయని చెప్పినట్టు సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తమ నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీనికి స్పందించిన పవన్‌ కళ్యాణ్‌ ఇకపై నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించి తన కార్యాలయానికే నేరుగా వినతులు ఇవ్వాలని సూచించినట్టు సమాచారం.   

పునర్విభజనపై పార్టీ వ్యూహానికి కమిటీ.. 
నియోజకవర్గాల పునరి్వభజన (డీలిమిటేషన్‌) అంశంలో పార్టీ ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఎమ్మెల్యేలతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సమా­వే­శంలో నిర్ణయించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పవన్‌ ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలిసింది. యువతే లక్ష్యంగా క్షేత్రస్థాయి­లో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం కొనసాగాలని వివరించినట్టు సమాచారం.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement