నిలిచిపోయిన గూడ్స్: రైళ్ల రాకపోకలకు అంతరాయం | Express Trains delays due to Technical Problem in goods engine at Mahabubnagar District | Sakshi
Sakshi News home page

నిలిచిపోయిన గూడ్స్: రైళ్ల రాకపోకలకు అంతరాయం

Feb 23 2014 8:38 AM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా గూడ్స్ రైలు నిలిచిపోయింది.

మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటక -  నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ జడ్చర్ల వద్ద నిలిచిపోయింది.

అలాగే చెన్నై - కాచిగూడ మధ్య నడిచే ఎగ్మూర్ ఎక్స్ప్రెస్ గొల్లపల్లి వద్ద ఆగిపోయింది. డెమో రైలు దివిటిపల్లి వద్ద నిలిచిపోయింది. అయితే గూడ్స్ రైలు ఇంజన్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement