breaking news
goods engine
-
వ్యాగన్‌ను ఢీకొన్న గూడ్స్ ఇంజన్
పాల్వంచ : ఖమ్మం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్‌లో శనివారం ప్రమాదం గూడ్స్ రైలు వ్యాగన్ ఢీకొట్టింది. కేటీపీఎస్ ఐదవ దశ కోల్ డంపింగ్ యార్డులో ఖాళీ వ్యాగన్ రైలు ఇంజన్ ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాగన్ బాగా దెబ్బతినడంతో సుమారు రూ.10 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. -
నిలిచిపోయిన గూడ్స్: రైళ్ల రాకపోకలకు అంతరాయం
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం రాజాపూర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఇంజన్లో సాంకేతిక లోపం కారణంగా గూడ్స్ రైలు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్ణాటక - నిజాముద్దీన్ ఎక్స్‌ప్రెస్ జడ్చర్ల వద్ద నిలిచిపోయింది. అలాగే చెన్నై - కాచిగూడ మధ్య నడిచే ఎగ్మూర్ ఎక్స్‌ప్రెస్ గొల్లపల్లి వద్ద ఆగిపోయింది. డెమో రైలు దివిటిపల్లి వద్ద నిలిచిపోయింది. అయితే గూడ్స్ రైలు ఇంజన్లో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని నివారించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టారు.