నర్సీపట్నం ఏఎస్పీగా ఏసుబాబు | esubabu appointed as asp | Sakshi
Sakshi News home page

నర్సీపట్నం ఏఎస్పీగా ఏసుబాబు

Aug 15 2014 3:35 AM | Updated on Sep 2 2017 11:52 AM

తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన భూసారపు సత్య ఏసుబాబు నర్సీపట్నం ఏఎస్పీగా నియమితులయ్యారు.

పి.గన్నవరం : తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన భూసారపు సత్య ఏసుబాబు  నర్సీపట్నం ఏఎస్పీగా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆయన తెలిపారు. ఆయన 2011 సివిల్స్‌లో జాతీయ స్థాయిలో105వ ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో 10 నెలలు శిక్షణ పొంది, ఏపీ కేడర్‌కు ఎంపికయ్యారు. అనంతరం నిజామాబాద్‌లో ఆరు నెలలు ఫీల్డ్ శిక్షణ, కొన్ని నెలలు గ్రేహౌండ్స్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం ఆయ న అఫాల్ట్ కమాండర్‌గా పని చేస్తున్నారు. నర్సీపట్నం ఏఎస్పీగా ఉన్న విశాల్‌గున్ని ఓఎస్‌డీగా వ్యవహరిస్తారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement