సచివాలయంలో ఉద్యోగుల నిరసన ర్యాలీ | Employee protest rally in Secretariat | Sakshi
Sakshi News home page

సచివాలయంలో ఉద్యోగుల నిరసన ర్యాలీ

Feb 9 2018 3:31 PM | Updated on May 25 2018 7:06 PM

Employee protest rally in Secretariat - Sakshi

సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ

అమరావతి : సచివాలయంలో శుక్రవారం ఉద్యోగుల నిరసన ర్యాలీకి దిగారు. ఏపీకి స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలంటూ మూడో బ్లాక్ వద్ద ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. అన్యాయంగా ఏపీని విభజన చేశారని మండిపడ్డారు. విభజన హామీలకోసం పార్లమెంటులో ఎంపీలు పోరాడుతున్నారని, హామీలు నెరవేర్చకుంటే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement