కుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం | Elephants attack on Chittoor district koppam mandal | Sakshi
Sakshi News home page

కుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం

Nov 21 2014 8:09 AM | Updated on Oct 4 2018 6:03 PM

చిత్తూరు జిల్లా ప్రజలను ఏనుగులు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా కుప్పం మండలం కూనూరు, నెర్నిపల్లిలో...

చిత్తూరు :  చిత్తూరు జిల్లా ప్రజలను  ఏనుగులు  కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా కుప్పం మండలం కూనూరు, నెర్నిపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై దాడి చేయటంతో భారీగా పంట నష్టం జరిగింది. ఏనుగులు గ్రామాల్లో సైతం చొరబడటంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు ఏనుగులను తమిళనాడు వైపు తరిమేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలలుగా కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement