breaking news
nernipalli
-
చిత్తూరు జిల్లాలో ఏనుగల బీభత్సం
-
కుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు : చిత్తూరు జిల్లా ప్రజలను ఏనుగులు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయి. తాజాగా కుప్పం మండలం కూనూరు, నెర్నిపల్లిలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలపై దాడి చేయటంతో భారీగా పంట నష్టం జరిగింది. ఏనుగులు గ్రామాల్లో సైతం చొరబడటంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. మరోవైపు ఏనుగులను తమిళనాడు వైపు తరిమేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. గత మూడు నెలలుగా కుప్పం నియోజకవర్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి.