పాఠశాల ఆవరణలో మందుబాబులు | Drunkards in School premises | Sakshi
Sakshi News home page

పాఠశాల ఆవరణలో మందుబాబులు

May 31 2015 9:28 AM | Updated on Sep 15 2018 5:45 PM

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు.

సంగం (శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు) : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సంగంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం రాత్రి ఆకతాయిలు రెచ్చిపోయారు. ఇటీవలే ఏర్పాటు చేసిన ఈ పాఠశాలకు వేసవి సెలవులు కావటంతో పాఠశాల ఆవరణలో మందుబాబులు రాత్రి వేళల్లో తిష్ట వేస్తున్నారు. శనివారం రాత్రి గ్రామానికి చెందిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం మత్తులో ఆరు తరగతి గదుల తలుపులను పగులగొట్టారు. ఆదివారం ఉదయం గమనించిన గ్రామస్తులు ప్రధానోపాధ్యాయునికి సమాచారం అందించారు.

Advertisement
 
Advertisement
Advertisement