కంజూస్‌ డాక్టర్‌ | hyderabad doctor bmw fake number plates drunk driving case | Sakshi
Sakshi News home page

కంజూస్‌ డాక్టర్‌

Apr 15 2026 7:39 AM | Updated on Apr 15 2026 7:57 AM

hyderabad doctor bmw fake number plates drunk driving case

ఇన్‌స్టాలో రీల్స్‌ చూసి..  

ఆన్‌లైన్‌లో నంబర్‌ ప్లేట్లు కొని.. 

‘స్లిప్పింగ్‌’తో పోలీసులకు బురిడీ

హైదరాబాద్: ఢిల్లీలో కొన్న సెకండ్‌ హ్యాండ్‌ బీఎండబ్ల్యూ కారుకు తెలంగాణలో రీ రిజిస్ట్రేషన్‌కు రూ.9 లక్షలు అవుతాయనే కారణంతో అతితెలివి ప్రదర్శించిన ఓ యువ వైద్యుడు క్రిమినల్‌ కేసులో ఇరుక్కున్నాడు. శనివారం జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన డ్రంకన్‌ డ్రైవ్‌లో మద్యం తాగి బీఎండబ్ల్యూ కారు నడుపుతూ పట్టుబడిన యువ వైద్యుడిపై కేసు నమోదైంది.  పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. అశోక్‌నగర్‌లో  నివసించే సత్తి గౌతమ్‌రెడ్డి (27) ఓ ఆస్పత్రిలో వైద్యుడు.

 మూడు రోజు క్రితం మాదాపూర్‌లోని పబ్‌లో మద్యం తాగి బీఎండబ్ల్యూ కారులో ఇంటికి వెళ్తుండగా ట్రాఫిక్‌ పోలీసులకు డ్రంకన్‌ డ్రైవ్‌లో చిక్కాడు. మద్యం మోతాదు 137 బీఏసీగా నమోదైంది. వివరాలు చెప్పడానికి గౌతమ్‌రెడ్డి నిరాకరించడంతో పాటు సంబంధిత పత్రాలు కూడా చూపించలేదు. కారు ముందొక నంబర్, వెనుక మరో నంబర్‌ ఉండడం చూసి ట్రాఫిక్‌ పోలీసులు షాక్‌ తిన్నారు. ఆరా తీస్తే స్టీరింగ్‌ వద్ద ప్రత్యేకమైన డివైస్‌ ఏర్పాటుచేసి స్లిప్పింగ్‌ నంబర్‌ ప్లేట్లు ఏర్పాటు చేసుకున్నట్లు తేలింది. బటన్‌ నొక్కగానే ముందు ఒక నంబర్, వెనుక ఒక నంబర్‌ మారుతుడటంతో పోలీసులు అయోమయానికి గురయ్యారు.  

రూ.9 లక్షలు ఖర్చవుతుందని.. 
కారు ఒరిజినల్‌ నంబర్‌ ఢిల్లీ రిజిస్ట్రేషన్‌ అని, డీఎల్‌ 6 సీఎం 7097గా తేల్చారు. ఢిల్లీ రిజి్రస్టేషన్‌ నంబర్‌ను తెలంగాణగా మార్చాలంటే సుమారు రూ.9 లక్షలు ఖర్చవుతుందని భావించిన గౌతమ్‌రెడ్డి దీనిని తప్పించుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో స్లిప్‌ అప్‌ రీల్స్‌ చూసి నంబర్‌ ప్లేట్లు మార్చే డివైస్‌ను కొనుగోలు చేశాడు. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టి ఢిల్లీ రిజి్రస్టేషన్, తెలంగాణ రిజి్రస్టేషన్‌ నంబర్‌ ప్లేట్లను కొనుగోలు చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ చూసి నంబర్‌ ప్లేట్లను మార్చే డివైస్‌ను  ఏర్పాటు చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో రెండు రాష్ట్రాల రిజి్రస్టేషన్‌ నంబర్లు తెప్పించుకుని అటు చలానాల నుంచి తప్పించుకుంటున్నాడు. ఇదంతా ‘ఫన్‌’ కోసమేనంటూ నిందితుడు పోలీసులతో చెప్పాడు. అశోక్‌నగర్‌లోని ఆయన నివాసంలో మరో బీఎండబ్ల్యూ కారు ఉంది. ఈ కారుకూ నంబర్‌ ప్లేట్లు మార్చే డివైస్‌ను ఏర్పాటు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement