చిరు వ్యాపారుల ధర్నా | dharna at ananthpuram collectorate | Sakshi
Sakshi News home page

చిరు వ్యాపారుల ధర్నా

Jul 10 2015 2:10 PM | Updated on Jun 1 2018 8:54 PM

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారులు ధర్నాకు దిగారు.

అనంతపురం: అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారులు ధర్నాకు దిగారు. శుక్రవారం ముదిగుబ్బ వైఎస్సార్‌సీపీ ఎంపీపీ మాలతి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో చిరు వ్యాపారులు కలెక్టరేట్‌కు చేరుకొని నిరసన తెలిపారు. ముదిగుబ్బ గ్రామపంచాయతీ అధికారులు ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు వెంటనే తొలగించాలని నోటీసులు జారీ చేసింది. శనివారంతో నోటీసుల గడువు ముగియనుండటంతో పెద్ద సంఖ్యలో ధర్నాకు దిగారు. వెంటనే నోటీసులను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement