క్రికెట్ టికెట్ల సొమ్ము వాపసు | Cricket ticket refund | Sakshi
Sakshi News home page

క్రికెట్ టికెట్ల సొమ్ము వాపసు

Nov 23 2014 7:09 AM | Updated on Sep 2 2017 4:59 PM

హుద్‌హుద్ తుపాను ప్రభావంతో గత నెల 14న రద్దయిన భారత్-వెస్టీండీస్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల సొమ్మును శనివారం చెల్లించారు.

పీఎం పాలెం : హుద్‌హుద్ తుపాను ప్రభావంతో గత నెల 14న రద్దయిన భారత్-వెస్టీండీస్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల సొమ్మును శనివారం చెల్లించారు. సుమారు రూ. 20 లక్షల వరకు చెల్లించినట్టు టికెట్ల సొమ్ము చెల్లింపు బృందం ప్రతినిధి డి.వి.ఎన్ .రాజు  తెలిపారు. మీ సేవా కేంద్రాల్లో టికెట్ కొనుగోలు చేసిన వారికి ఆయా కేంద్రాల్లో చెల్లిస్తారని చెప్పారు.

స్టేడియం వద్ద రూ. 5000 టికెట్ కొనుగోలు చేసిన 77 మంది, రూ. 2000 టికెట్ కొనుగోలు చేసిన 213 మంది, రూ.1500 టికెట్ కొనుగోలు చేసిన 285 మంది, రూ. 400 టికెట్లు కొనుగోలు చేసిన 1900 మందికి గేట్ నెం- 19, 16, 15 వద్ద సొమ్ము వాపసు చేస్తున్నామని తెలిపారు. ఆదివారం కూడా ఈ సొమ్ము వాపసు ప్రక్రియ కొనసాగుతుందన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement