పిడుగుపాటుకు దంపతులు బలి | Couple dies due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు దంపతులు బలి

Jun 5 2015 6:40 PM | Updated on Jul 10 2019 7:55 PM

కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సీతారామపురం గ్రామంలో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు.

బేతంచర్ల : కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం సీతారామపురం గ్రామంలో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. సీతారామపురం గ్రామానికి చెందిన పాపన్న, ఆయన భార్య భాగ్యమ్మ శుక్రవారం మధ్యాహ్నం పొలానికి వెళ్లారు.  భార్యాభర్తలు పొలంలో పని చేస్తుండగా భారీ వర్షం మొదలయ్యింది. దాంతో సమీపంలోని ఓ చెట్టును ఆశ్రయించారు. చెట్టు కింద ఉండగా... సమీపంలోనే పిడుగు పడడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు.

Advertisement
 
Advertisement
Advertisement