బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలి | Compassionate appointments should be given eligible cadidates | Sakshi
Sakshi News home page

బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలి

Dec 11 2013 4:40 AM | Updated on Sep 2 2017 1:27 AM

విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలని ఏపీఈఈయూ 1104 రాష్ట్ర యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ పద్మారెడ్డి డిమాండ్ చేశారు.

ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్ : విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలని ఏపీఈఈయూ 1104 రాష్ట్ర యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ పద్మారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని జిరాయత్ నగర్‌లో గల మిలన్ ఫంక్షన్ హాలులో ఏపీఈఈయూ ఆర్మూర్ డివిజన్ కమిటీ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. డివిజన్ కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పద్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనియన్ లో నెలకొన్న సమస్యలపై 1104 అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత కోసం న్యా యపరంగా పోరాటం చేశామన్నారు. ఉద్యోగులు, కా ర్మికుల పదోన్నతులు, డీఏ, బెనిఫిట్స్ అర్హులైన ఉద్యోగులకు అందని పక్షంలో ఆరు నెలల్లో ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. 
 
 ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. రెండు, మూడు లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ సరిపోవడం లేదని, పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో, ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలని కోరారు.  అంతకు ముందు పలువురు వక్తలు యూనియన్ సమస్యలు, పరిష్కార మార్గాలు, భవిష్యత్తు ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ నివేదికను చదివి వినిపించారు. అనంతరం డివిజన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు.  కార్యక్రమంలో ఎన్‌పీడీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ప్రాంతీయ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, నాయకులు లింగం, జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, సురేష్ బాబు, నరేంద్ర నాయక్, బి సురేష్, బంజ రాజేంధర్, హరిశంకర్, రాజ్ కుమార్, మధు, నిజామొద్దీన్, గోపి, నర్సయ్య, నాగభూషణం, వాసం శ్రీనివాస్, షకీల్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement