breaking news
padma reddy
-
వైఎస్సార్సీపీకి ఓటేసిన కూటమి కార్పొరేటర్లు
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో కూటమికి గట్టి షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ పద్మ రెడ్డి విజయం సాధించారు. భారీగా క్రాస్ ఓటింగ్ జరగ్గా.. కూటమి కార్పొరేటర్లు వైఎస్సార్సీపీకి ఓటు వేశారు. మొత్తం సీట్లు గెలుస్తామంటూ కూటమి నేతలు బీరాలు పలికారు. 50 ఓట్లతో పద్మ రెడ్డి గెలుపొందారు. పార్టీ ఫిరాయింపు కార్పొరేటర్లను ఓటింగ్‌కు వాడుకున్నా కానీ కూటమికి భంగపాటు తప్పలేదు.కార్పొరేటర్ పద్మా రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఓటు వేసిన 50 మంది కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు. బీసీ వర్గానికి చెందిన మహిళను మార్చారనే బాధ కార్పొరేటర్లలో ఉందన్నారు. గతంలో స్టాండింగ్ ఎన్నికలకు ఎక్కడా డబ్బులు ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూటమి క్యాంపు రాజకీయాలకు తెర లేపింది. కూటమి బాధితులు తమకు సహకరించారని ఆమె పేర్కొన్నారు.కూటమి పాలనకు చెంప పెట్టు: కేకే రాజువైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కార్పొరేటర్లు ఇచ్చిన తీర్పు కూటమి పాలనకు చెంప పెట్టు అన్నారు. ‘‘గతంలో అడ్డగోలుగా మేయర్ పదవిని కూటమి కైవసం చేసుకుంది. బీసీ మహిళకు జగన్ అవకాశం ఇస్తే అడ్డదారిలో మహిళా మేయర్‌ను దించేశారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు ఎన్నడూ డబ్బుతో రాజకీయం చేయలేదు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూడా క్యాంప్ రాజకీయం చేశారు. మాకున్న బలం 32 మంది కార్పొరేటర్లు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన అందరికీ 32 ఓట్ల కంటే అధికంగా వచ్చాయి.50 ఓట్లతో ఒక స్టాండింగ్ కమిటీ సీట్ గెలిచాం. కూటమి కార్పొరేటర్లు కూడా మాకు ఓటు వేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరవాలి. గెలిచిన స్థానాన్ని ప్రకటించడానికి కూడా ఇబ్బంది పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి బయటకు వెళ్లిన కార్పొరేటర్లు పశ్చాత్తాప పడి మాకు ఓట్లు వేసి ఉండచ్చు. కూటమి భయభ్రాంతులకు గురి చేసినా పోటీ చేసిన వారికి అభినందనలు’’ అని కేకే రాజు పేర్కొన్నారు. -
బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలి
ఆర్మూర్ టౌన్, న్యూస్‌లైన్ : విద్యుత్ శాఖలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు విధి నిర్వహణలో, ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలని ఏపీఈఈయూ 1104 రాష్ట్ర యూనియన్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎన్ పద్మారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని జిరాయత్ నగర్లో గల మిలన్ ఫంక్షన్ హాలులో ఏపీఈఈయూ ఆర్మూర్ డివిజన్ కమిటీ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. డివిజన్ కమిటీ అధ్యక్షుడు సురేష్ బాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పద్మారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ యూనియన్ లో నెలకొన్న సమస్యలపై 1104 అనేక ఉద్యమాలు చేపట్టిందన్నారు. కార్మికుల ఉద్యోగ భద్రత కోసం న్యా యపరంగా పోరాటం చేశామన్నారు. ఉద్యోగులు, కా ర్మికుల పదోన్నతులు, డీఏ, బెనిఫిట్స్ అర్హులైన ఉద్యోగులకు అందని పక్షంలో ఆరు నెలల్లో ఇప్పించేలా కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, కార్మికులకు ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. రెండు, మూడు లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ సరిపోవడం లేదని, పూర్తి స్థాయిలో ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో, ప్రమాదంలో మరణించిన కుటుంబాలను ప్రభుత్వమే అన్ని విధాలుగా ఆదుకోవాలని, వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి బేషరతుగా ఉద్యోగం ఇవ్వాలని కోరారు. అంతకు ముందు పలువురు వక్తలు యూనియన్ సమస్యలు, పరిష్కార మార్గాలు, భవిష్యత్తు ప్రణాళిక, తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా డివిజన్ కమిటీ నివేదికను చదివి వినిపించారు. అనంతరం డివిజన్ నూతన కమిటీ ఎన్నికలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, కార్యదర్శి మధుసూదన్ రెడ్డి, ప్రాంతీయ అధ్యక్షుడు వేణుగోపాల్ రావు, నాయకులు లింగం, జిల్లా కార్యదర్శి లక్ష్మారెడ్డి, సురేష్ బాబు, నరేంద్ర నాయక్, బి సురేష్, బంజ రాజేంధర్, హరిశంకర్, రాజ్ కుమార్, మధు, నిజామొద్దీన్, గోపి, నర్సయ్య, నాగభూషణం, వాసం శ్రీనివాస్, షకీల్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.