ఎంపికైన వారందరు శాశ్వత ఉద్యోగులే... | Sakshi
Sakshi News home page

‘ఎంపికైన వారంతా ప్రభుత్వ ఉద్యోగులే’

Published Sat, Sep 21 2019 6:53 PM

Collector Inthiyaz Talks In Press Meet Over Village Secretariat Recruitment In Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రభుత్వ సేవలను పారదర్శకంగా ప్రజల గుమ్మం ముందుకు చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిందని కృష్ణాజిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌​ అహ్మద్‌ అన్నారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 11,025 పోస్టులు ఉన్నాయని, వీటికి 2లక్షల 625 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయగా, 69,216 మంది అర్హత సాధించినట్లు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయంలో మొత్తం 14 శాఖలకు సంబంధించిన పోస్టులు ఉన్నాయని, అలాగే ఎంపికైన అభ్యర్థులను అర్హతను బట్టి ఆయా శాఖలకు ఎంపిక చేస్తామని అన్నారు. ఎంపికైన వారందరు శాశ్వత ఉద్యోగులుగా ఉంటారని పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను సంబంధిత శాఖల అధికారులకు పంపించామని, రేపు లేక ఎల్లుండి కాల్‌ లెటర్లు పంపించనున్నట్లు తెలిపారు. అలాగే ఈ నెల 24, 25 తేదీల్లో ధ్రువ పత్రాల పరిశీలన ఉంటుందని, రోస్టర్‌ పాయింట్‌ విధానంలో నియామకం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు 30, 1 తేదీల్లో శిక్షణ ఇచ్చి అక్టోబర్‌ 2వ తేదీ నుంచి విధుల్లోకి పంపనున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు.

చదవండి: ‘సచివాలయ’ ఫలితాలు విడుదల

సచివాలయ ఫలితాలు: కేటగిరీ వారీ ఉత్తీర్ణుల జాబితా

‘సచివాలయ’ టాపర్స్‌ వీరే

Advertisement
Advertisement