కాకినాడ: ‘విజన్ యూనిట్’ అంటూ సచివాలయాల పేరును మార్చాలనుకుంటున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేరు మార్చవచ్చేమో కానీ వ్యవస్థను సృష్టించిన వాళ్లను మార్చలేరంటూ ధ్వజమెత్తారు. స్ధానిక స్వపరిపాలన,ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సిఎం వైఎస్ జగన్ అని, స్ధానిక స్వపరిపాలనకు వైఎస్ జగన్ మార్గదర్శి అని స్పష్టం చేశారు కురసాల.
ఈరోజు(శుక్రవారం, నవంబర్ 7వ తేదీ) కాకినాడ నుంచి మాట్లాడిన కురసాల.. ‘తుపాన్ భాధితుల కోసం ప్రభుత్వం ఆలోచిస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఐతే కొన్ని పేపర్‌లు చూస్తే డేటా ఆధారిత సెంటర్లు అని రాసి ఉన్నాయి. తుపాను తర్వాత చంద్రబాబు లండన్ వెళ్లిపోతే.. మంత్రి లోకేష్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి ముంబై వెళ్లిపోయాడన్నారు. లండన్ బాబు వచ్చి డేటా ఆధారిత పరిపాలన కోసం మాట్లాడుతున్నారు. తుపాన్ వల్ల ఎంత పంట నష్టం జరిగింది? ఎంత మంది రైతులు నష్టపోయారు? ఎన్ని రోడ్లు పోయాయంటే డేటా లేదు.
స్ధానిక స్వపరిపాలన , ప్రజల వద్దకే పాలన కలకు నిజమైన రూపం ఇచ్చింది మాజీ సీఎం వైఎస్ జగన్. విజన్ యూనిట్ అని సచివాలయాల పేరు మార్చాలనుకున్నారు. పేరు మార్చవచ్చేమో కానీ... వ్యవస్ధలను సృష్టించిన వాళ్ళను మార్చలేరు. *హెడ్ లైన్లు..అందమైన ఫోటోలకు తప్పా... నిన్న ఏం చేశాం అనే దానిపై ఫాలోఫ్ ఉంటుందా?, బెల్టు షాపుల మీద ఉక్కుపాదం అని చంద్రబాబు చెబుతున్నారు.. గత 16 నెలలుగా ఏం చేశారు?, ప్రభుత్వ మద్యానికి సమాంతరంగా నకిలీ మద్యాన్ని తీసుకువచ్చారు.
మద్యం అమ్మకాలు ఎందుకు తగ్గాయో మీరే నమ్మట్లేదు. నకిలీ మద్యాన్ని అమ్మడం వల్లే మద్యం అమ్మకాలు తగ్గాయి. చాలా గందరగోళం లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సచివాలయాలను విజన్ యూనిట్ అని చంద్రబాబు అంటున్నారు కధా? ఎవరూ విజనరీనో చంద్రబాబు చెప్పాలి. వాట్సప్ లో సేవలు అందుతున్నప్పుడు ..లోకేష్ దగ్గరికి, కలెక్టరేట్ లకు ఎందుకు ప్రజలు తమ అర్జీలను తీసుకువెళ్తున్నారు’ అని కురసాల ప్రశ్నించారు.
బండి సంజయ్‌కు నో.. కేటీఆర్ ఓకే


