సీఎం సామాన్య పౌరుడిలా మాట్లాడటం హాస్యాస్పదం | CM kiran kumar reddy talked as a common man: bhuma nagireddy | Sakshi
Sakshi News home page

సీఎం సామాన్య పౌరుడిలా మాట్లాడటం హాస్యాస్పదం

Aug 9 2013 1:31 PM | Updated on Sep 1 2017 9:45 PM

రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ సామాన్య పౌరుడిలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు.

రాష్ట్ర విభజనపై సీఎం కిరణ్ సామాన్య పౌరుడిలా మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి శుక్రవారం కర్నూలులో పేర్కొన్నారు. పార్టీ జెండా పట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు సమైక్యవాదులమని చెప్పడం సరికాదని భూమా నాగిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఆ పార్టీ నాయకులు పార్టీకి, పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విభజనపై హోంశాఖ ఆధ్వర్యంలో చట్టబద్ధ కమిటీని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను ఆంటోనీ కమిటీకి చెప్పేది లేదని భూమా నాగిరెడ్డి స్పష్టం చేశారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement