లారీ ఢీకొని ఆరేళ్ల బాలుడి మృతి | chidren deid in road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ఆరేళ్ల బాలుడి మృతి

Apr 18 2015 10:31 AM | Updated on Aug 30 2018 3:56 PM

కృష్ణా జిల్లా బాపులపాడులో పెనువిషాదం చోటుచేసుకుంది.

బాపులపాడు : కృష్ణా జిల్లా బాపులపాడులో పెనువిషాదం చోటుచేసుకుంది. స్కూల్‌కు వెళ్లేందుకు రోడ్డుపై నిల్చున్న ఆరేళ్ల బాలుడిని ఓ లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం కృష్ణా జిల్లా బాపులపాడు మండలం అంపాపురం గ్రామంలో జరిగింది. వివరాలు..గ్రామానికి చెందిన గొల్ల మురళి కృష్ణ(6) సమీపంలోని వీరవల్లు గ్రామంలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో రెండో తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే శనివారం గ్రామంలోని బస్‌స్టాప్ వద్ద బస్సు కోసం ఎదురుచూస్తుండగా వేగంగా వెళ్తున్నలారీ అదుపుతప్పి బాలుడిని ఢీ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement