చాటింగ్‌ పేరుతో చీటింగ్‌ | cheating with chatting | Sakshi
Sakshi News home page

చాటింగ్‌ పేరుతో చీటింగ్‌

Jul 24 2017 9:46 AM | Updated on May 3 2018 3:20 PM

చాటింగ్‌ పేరుతో చీటింగ్‌ - Sakshi

చాటింగ్‌ పేరుతో చీటింగ్‌

మాయమాటలు చెప్పి అమ్మాయిలను ఎరచూపి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి ఖాతాలోంచి రూ.13.29 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

► అమ్మాయిలను ఎరచూపి రూ.13.29 లక్షలు స్వాహా

సీతమ్మధార (విశాఖ ఉత్తరం): మాయమాటలు చెప్పి అమ్మాయిలను ఎరచూపి ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి ఖాతాలోంచి రూ.13.29 లక్షలు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేసుకు సంబంధించి ఫోర్తుటౌన్‌ ఎస్‌ఐ సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ బంగకు చెందిన రైల్వే న్యూ కాలనీలో నివాసం ఉంటున్న సుభాష్‌  చంద్రదాస్‌(60) విశ్రాంత రైల్వే ఉద్యోగి. అతనికి సౌరబ్‌దాస్‌ (17) అనే కుమారుడు ఉన్నాడు. సౌరబ్‌దాస్‌కు కొన్నాళ్ల కిందట అమ్మాయిలతో ఆన్‌లైన్‌లో పరిచయం ఏర్పడింది. వారితో రోజూ చాటింగ్‌ చేయడంతో స్నేహితులయ్యారు. అనంతరం మాయమాటాలు చెప్పి నగదు కావాలని అడిగారు.

దీంతో సౌరబ్‌ దాస్‌ తన తండ్రి ఖాతా నుంచి ఆన్‌లైన్‌లో రూ.30 వేలు, రూ.40వేలు చొప్పున 34 సార్లు కార్డు ద్వారా నగదు బదిలీ చేశాడు. రెండు రోజుల కిందట సుభాష్‌ చంద్రదాస్‌ ఖాతా చూసుకుంటే అందులో నగదు లేకపోవడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే నాలుగో పట్టణ పోలీసులను ఆశ్రయించడంతో వారు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అయితే కార్డు ద్వారా కుమారుడు సౌరబ్‌దాస్‌ ఆన్‌లైన్‌లో నగదు బదిలీ చేశాడని గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కాల్‌డేటా ఆధారంగా ఇతర రాష్ట్రాలకు  పోలీసు బృందాలను పంపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement