పర్యావరణ పరిరక్షక దేవుడు గణనాథుడు | Chandrababu Vinayaka Chavithi wishes | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షక దేవుడు గణనాథుడు

Aug 25 2017 1:27 AM | Updated on Jul 28 2018 3:41 PM

పర్యావరణ పరిరక్షక దేవుడు గణనాథుడు - Sakshi

పర్యావరణ పరిరక్షక దేవుడు గణనాథుడు

వినాయకుడు ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఆరాధ్యదైవమని, గణేశ్‌ పూజలకు మట్టి ప్రతిమలనే ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు

సాక్షి, అమరావతి : వినాయకుడు ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఆరాధ్యదైవమని, గణేశ్‌ పూజలకు మట్టి ప్రతిమలనే ఉపయోగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలకు, దేశ, విదేశాల్లోని తెలుగు వారికి ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పురోభివృద్ధికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు.

విఘ్నేశ్వురుణ్ణి 21 రకాల చెట్ల ఆకులతో పూజించాలని శాస్త్రాలు చెబుతున్నాయని, ఔషధ గుణాలున్న అటువంటి వృక్ష జాతులను రక్షించి, భావితరాలకు అందించాలన్న సందేశం ఇందులో ఇమిడి ఉందని ముఖ్యమంత్రి అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement