చంద్రబాబు సీఎంగా అలసిపోయారు: టీడీపీ ఎంపీ | Chandrababu tired of being cm, says tdp mp divakar reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సీఎంగా అలసిపోయారు: టీడీపీ ఎంపీ

May 23 2017 3:45 PM | Updated on Jul 28 2018 3:39 PM

చంద్రబాబు సీఎంగా అలసిపోయారు: టీడీపీ ఎంపీ - Sakshi

చంద్రబాబు సీఎంగా అలసిపోయారు: టీడీపీ ఎంపీ

పోలవరం ప్రాజెక్టు 2018లోపు పూర్తికావడం అసాధ్యమని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు.

అనంతపురం: పోలవరం ప్రాజెక్టు 2018లోపు పూర్తికావడం అసాధ్యమని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి అన్నారు. 2018 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదేపదే చెబుతున్నారని గుర్తు చేశారు. అయితే, బాబు ఆశించడంలో తప్పులేదు కానీ పరిస్ధితులు అందుకు అనుకూలంగా లేవని చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో రూ.100 కోట్ల యంత్రం కాలిపోయిందని, దాని స్ధానంలో కొత్తది తీసుకురావాలంటే మరో ఆరు నెలల నుంచి ఏడాది కాలం పడుతుందని తెలిపారు. 15 సంవత్సరాలు సీఎంగా పని చేసి చంద్రబాబు అలసిపోయారని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement