ఇన్నాళ్లకు బాబుకు తత్త్వం బోధపడింది | Chandrababu Naidu On Election Results | Sakshi
Sakshi News home page

ఇన్నాళ్లకు బాబుకు తత్త్వం బోధపడింది

Apr 2 2019 9:25 PM | Updated on Apr 2 2019 9:41 PM

Chandrababu Naidu On Election Results - Sakshi

సాక్షి, అమరావతి : ఇన్నాళ్లకు చంద్రబాబుకు తత్త్వం బోధపడినట్టు కనపడుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. బాబు సత్యాన్ని గ్రహించారు. రాబోయే ఎన్నికల్లో వెలువడే ఫలితాన్ని ముందుగానే అంచనావేశారు. ఇక తన అనుభవం ఈ రాష్ట్రానికి చాలునని చంద్రబాబు గ్రహించినట్టున్నారు. ఈ ఎన్నికల్లో తాను ఓడినంత మాత్రాన తనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదంటూ.. తనకు ఫ్యామిలీ ఉందని, మనవడు కూడా ఉన్నాడని వేదాంతధోరణిని ఎత్తుకున్నారు.

బీజేపీ నాయకుడు కన్నా లక్మీ నారాయణ.. చంద్రబాబు మాట్లాడిన వీడియోను పోస్ట్‌ చేస్తూ.. ‘అదిరిందయ్య చంద్రం..! ఇన్నాళ్లకు మీ 40 ఏళ్ల అనుభవంతో  మీ భవిష్యత్తు ని సరిగ్గా అంచనా వేసుకున్నారు.. తథాస్తు దేవతలు తప్పక మీ కోరిక నెరవేరుస్తారు. మీ విషయంలో ప్రజలు కూడా అదే భావనతో ఉన్నారు..మరో వారం తరువాత శాశ్వతంగా మీరు మనవడితో పూర్తి సమయం ఆడుకునే అవకాశం ఇవ్వబోతున్నారు.’అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement