చంద్రబాబు పని అయిపోయింది | chandra babu everythink finish to do | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పని అయిపోయింది

Aug 24 2013 5:07 AM | Updated on Aug 10 2018 5:38 PM

రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. ఇప్పుడు ఆత్మగౌరవ ం పేరిట భారీ పోలీసు బందోబస్తు మధ్య బస్సు యాత్ర చేపట్టనున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ జీవితాన్ని ఎవరూ రక్షించలేరని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.

రాయదుర్గం, న్యూస్‌లైన్ : రాష్ర్ట విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి.. ఇప్పుడు ఆత్మగౌరవ ం పేరిట భారీ పోలీసు బందోబస్తు మధ్య బస్సు యాత్ర చేపట్టనున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ జీవితాన్ని ఎవరూ రక్షించలేరని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.
 
 రాయదుర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కాపు భారతి చేపట్టిన ఆమరణ దీక్ష శిబిరంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రతి ఒక్కరి గుండె నుంచి పుట్టిందని, అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు ఉద్యమంలో ఉన్నారని తెలిపారు. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ఉద్యమంలో బ్లాక్ క్యాట్ కమెండోలను వెంట పెట్టుకుని యాత్ర చేస్తే ఆయన్ను ప్రజలెలా నమ్ముతారన్నారు. ఇటలీ రాణి తన కుమారుడిని ప్రధానిని చేయడానికి రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement