తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంఛార్జ్ లుగా కేంద్ర మంత్రులు | central ministers appointed as 7 state BJP inchages | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంఛార్జ్ లుగా కేంద్ర మంత్రులు

Mar 10 2015 6:19 PM | Updated on Mar 29 2019 9:31 PM

రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంఛార్జ్లుగా కేంద్ర మంత్రులను నియమించింది.

ఢిల్లీ : రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఇంఛార్జ్లుగా కేంద్ర మంత్రులను నియమించింది. వచ్చే లోక్సభ ఎన్నికల వరకు ఏడు రాష్ట్రాల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు బీజేపీ కేంద్ర మంత్రులను ఆయా రాష్ట్రాలకు ఇంఛార్జ్లుగా నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్గా జేపీ నడ్డా, తెలంగాణకు హంసరాజు అహిద్ లను పార్టీ అధిష్టానం నియమించింది. వీటితో పాటు తమిళనాడుకు పీయూష్ గోయల్, కేరళకు రాజీవ్ ప్రతాప్రూడీ, పశ్చిమ బెంగాల్కు నిర్మలా సీతారామన్, అస్సాంకు ధర్మేంద్ర ప్రధాన్, ఒడిషా బీజేపీ ఇంఛార్జ్గా మహేశ్ శర్మలను పార్టీ అధిష్టానం మంగళవారం నియమించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement