కారు, లారీ ఢీ: ఇద్దరి మృతి | Car , lorry collide - two killed | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ: ఇద్దరి మృతి

Nov 30 2015 10:24 AM | Updated on Sep 4 2018 5:07 PM

కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి.

కర్నూలు జిల్లాలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో ఇద్దరు మృత్యువాతపడగా మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామ సమీపంలో జాతీయరహదారిపై ఈ ఘటన జరిగింది. వైఎస్సార్ జిల్లా కడప నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు.. నంద్యాల వైపు వస్తున్న లారీ ఎదురుగా ఢీకొనటంతో కారులో ఉన్న ఇద్దరు చనిపోగా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను హైదరాబాద్‌కు చెందిన నరేంద్రారెడ్డి, వర్షగా గుర్తించారు.



 

Advertisement
 
Advertisement
Advertisement