
'చంద్రబాబుకు నిద్రలేకుండా పోయింది'
ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవడంతో చంద్రబాబుకు నిద్రలేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు
విశాఖపట్నం: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవడంతో చంద్రబాబుకు నిద్రలేకుండా పోయిందని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ మోదీని కలవడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. రాష్ట్ర సమస్యలపై మాట్లాడటానికి వైఎస్ జగన్ మోదీని కలిశారని, ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా వెళ్తాం అని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
తెలంగాణ ఎంపీలు కూడా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తున్నారని, రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎందుకు హోదాపై మాట్లాడటం లేదని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వెంకయ్య నాయుడు ఏమన్నారో ఒకసారి వినాలని చంద్రబాబుకు సూచించారు. హోదా ముగిసిపోయిన అధ్యాయమా అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబులా ఊసరవెళ్లి రాజకీయాలు చేయమని, ప్రత్యేక హోదాపై వైఎస్‌ఆర్‌సీపీ రాజీపడదని స్పష్టం చేశారు. వైఎస్ జగన్‌పై చంద్రబాబు మాట్లాడుతున్నవి చవకబారు మాటలని బొత్సా సత్యనారాయణ విమర్శించారు.