దొంగల అరెస్టు: 34 బైక్‌లు స్వాధీనం | bike robbers arrested in west godavari district | Sakshi
Sakshi News home page

దొంగల అరెస్టు: 34 బైక్‌లు స్వాధీనం

Jun 21 2016 11:03 AM | Updated on Aug 30 2018 5:24 PM

ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కొవ్వూరు: ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 34 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలివీ... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంనకు చెందిన మోహన్‌రావు, మోషేదయాకర్, కడియం మండలం బుర్రిలంకకు చెందిన చిన్నబ్బాయి ముఠాగా ఏర్పడి రెండేళ్లుగా ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం వారిని కొవ్వూరులో అదుపులోకి తీసుకున్నారు. దొంగల ముఠా ఎత్తుకుపోయిన ద్విచక్రవాహనాల విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు డీఎస్పీ వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement