breaking news
bikes caught
-
ఈజీమనీ కోసం బైక్ దొంగతనాలు
కరీంనగర్: జల్సాలకు అలవాటుపడి ఈజీమనీ కోసం దొంగతనాల బాట పట్టిన ఓ ద్విచక్రవాహనాల దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గత కొన్ని రోజులుగా పార్క్ చేసి ఉన్న బైక్లను దొంగలిస్తున్న ఓ యువకుడిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 7 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
దొంగల అరెస్టు: 34 బైక్లు స్వాధీనం
కొవ్వూరు: ముగ్గురు అంతర్ జిల్లా దొంగలను పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 34 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నర్రా వెంకటేశ్వరరావు తెలిపిన వివరాలివీ... తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంనకు చెందిన మోహన్రావు, మోషేదయాకర్, కడియం మండలం బుర్రిలంకకు చెందిన చిన్నబ్బాయి ముఠాగా ఏర్పడి రెండేళ్లుగా ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం వారిని కొవ్వూరులో అదుపులోకి తీసుకున్నారు. దొంగల ముఠా ఎత్తుకుపోయిన ద్విచక్రవాహనాల విలువ సుమారు రూ.13 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్కు పంపనున్నట్లు డీఎస్పీ వివరించారు.


