'రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ నైజం' | Bhumana Karunakar Reddy takes on congress party | Sakshi
Sakshi News home page

'రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ నైజం'

Dec 5 2013 12:26 PM | Updated on Mar 18 2019 7:55 PM

'రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ నైజం' - Sakshi

'రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ నైజం'

రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.

రాష్ట్ర ప్రజలతో కాంగ్రెస్ పార్టీ ఆటలాడుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన తిరుపతిలో మాట్లాడుతూ...  రోజుకో మాట చెప్పడం కాంగ్రెస్ పార్టీ నైజమని ఆయన పేర్కొన్నారు. ఓ రోజు తెలంగాణ, మరో రోజు రాయల తెలంగాణ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు దొంగనాటకాలాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

 

తమ పార్టీ సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ లభిస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని కరుణాకర్ రెడ్డి నిప్పులు చెరిగారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement