టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు | Bhattiprolu ZPTC Resigned To TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో భగ్గుమన్న వర్గపోరు

Published Mon, Oct 1 2018 3:32 PM | Last Updated on Mon, Oct 1 2018 8:13 PM

Bhattiprolu ZPTC Resigned To TDP - Sakshi

మంత్రి నక్కా ఆనందబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు...

సాక్షి, అమరావతి : టీడీపీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. స్థానికంగా నేతల మధ్య విభేదాలతో ఒకరివెనుక ఒకరు రాజీనామాల దారిపడుతున్నారు. తాజాగా టీడీపీకి చెందిన భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు బండారు కుమారి రాజీనామా చేశారు. మంత్రి నక్కా ఆనందబాబు వైఖరికి నిరసనగా రాజీనామా చేసినట్లు ఆమె ప్రకటించారు. మంత్రి ప్రోటోకాల్‌ పట్టించుకోకుండామ తమపై వివక్ష చూపుతున్నారని విమర్శించారు. తమను ఏ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమానికీ రాన్వికుండా మంత్రి అడ్డుకుంటురని ఆవేదన వ్యక్తం చేశారు. 

21 మంది కౌన్సిలర్ల రాజీనామా..
వైస్సార్‌జిల్లా : ప్రొద్దుటూరు టీడీపీలో వర్గపోరు మరోసారి భయటపడింది. టీడీపీకి చెందిన 21 మంది కౌన్సిలర్లు, ఇద్దరు కో ఆప్షన్‌ సభ్యులు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారంతా మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి వర్గానికి చెందిన వారే కావడం విశేషం. వరదరాజుల రెడ్డి మున్సిపాలిటీపై  ఆధిపత్యం చెలాయిస్తున్నారని... ఛైర్మన్‌ను అడ్డుపెట్టుకుని తమకు ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement