అనంతపురం జిల్లాలో కలకలం | Bangalore ATM accused in Rayadurgam | Sakshi
Sakshi News home page

అనంతపురం జిల్లాలో కలకలం

Dec 25 2013 3:14 PM | Updated on Sep 2 2017 1:57 AM

అనంతపురం జిల్లాలో కలకలం

అనంతపురం జిల్లాలో కలకలం

బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలి ఉన్న వ్యక్తి అనంతపురం జిల్లా రాయదుర్గంలో కనిపించాడు.

అనంతపురం:  బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన నిందితుడిని పోలి ఉన్న వ్యక్తి అనంతపురం జిల్లా రాయదుర్గంలో కనిపించాడు. ఎస్బిఐ ఏటిఎం వద్ద సెక్యూరిటీ గార్డ్‌ అతనిని గుర్తించాడు. పట్టుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు పారిపోయాడు. ఈ ఘటన జిల్లాలో కలకలం సృష్టించింది.

అనంతపురం జిల్లా ధర్మవరంలో గత నెల 10న ప్రమీలమ్మ అనే మహిళను చంపిన హంతకుడు,  11న కదిరి ఏటీఎంలో డబ్బు డ్రా చేసిన వ్యక్తి,19న బెంగళూరు ఏటీఎంలో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దాడి చేసిన వ్యక్తి ఒక్కరేనని ఆంధ్ర, కర్ణాటక పోలీసులు నిర్ధారణకు వచ్చిన విషయం తెలిసిందే.  అతను సైకో కావడంతో అతనిని పోలిన వ్యక్తే ఈ రోజు రాయదుర్గంలో కనిపించాడని తెలియడంతో ఎవరిని ఏం చేస్తాడోనన్న భయం కొందరిలో వ్యక్తమవుతోంది.

అయితే అతను ఆ బెంగళూరు నిందితుడు కాదని పోలీసులు నిర్ధారించారు.  రాయదురం పోలీసులు  సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించారు. అందులో ఏటిఎంకు వచ్చినది  బెంగళూరు నిందితుడు కాదని వారు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement