Hyd: భూములు బంగారం.. కొండలకే కోట్లు | TGIIC Land Auction Fetches Record Price Again In Rayadurgam | Sakshi
Sakshi News home page

Hyd: భూములు బంగారం.. కొండలకే కోట్లు

Jun 1 2026 6:42 PM | Updated on Jun 1 2026 6:54 PM

TGIIC Land Auction Fetches Record Price Again In Rayadurgam

హైదరాబాద్‌:  తెలంగాణ రాష్ట్ర రాజధానిలో భూములు బంగారమైపోయాయి. కొండలే రూ.కోట్లు పలుకుతున్నాయి. హైదరాబాద్‌ భూముల వేలం సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.  తాజాగా ప్రభుత్వం నిర్వహించిన రాయదుర్గం భూముల వేలంలో ఎకరం రెండొందల కోట్లు పైగానే పలికింది. వరుసగా నిర్వహించిన రెండు  వేలాల్లో సైతం ఎకరం భూమి ధర రెండొందల కోట్ల మార్కును దాటేయడం విశేషం. గతంలో రూ. 177 కోట్లు పలికితేనే వామ్మో అనుకునే ఆశ్చర్యపోతే, ఇప్పుడు రూ. 200 కోట్లను ఎకరం భూమి దాటేసి మరీ రికార్డులను స్పష్టించింది. 

ఈరోజు(సోమవారం, జూన్‌ 1వ తేదీ) టీజీఐఐసీ(Telangana Industrial Infrastructure Corporation) తాజాగా నిర్వహించిన భూముల వేలంలో రికార్డు ధర పలికింది. టీజీఐఐసీ వేలంలో రూ. 204 కోట్లకు పైగా పలికింది రాయదుర్గం భూమి. రాయదుర్గంలో 5 ఎకరాల 9 గుంటల భూమికి వేలం వేయగా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వెళ్లింది. 

రెండు రోజుల క్రితం వేలంలో ఎకరం భూమి రూ. 237 కోట్లు రికార్డు ధర పలకగా, ఈసారి  అదే పరిధిలో ఎకరం భూమి రూ. 204 కోట్లకు వెళ్లింది. దాంతో రెండు విడతల్లోనూ రెండొందల కోట్ల మార్కను ఎకరం భూమి దాటేయడంతో భూములు మరింత ప్రియం అయిపోతున్నాయని అనుకోవడం మన వంతైంది. రెండు విడతల్లో కలిపి ప్రభుత్వానికి రూ. 2500 కోట్ల ఆదాయం సమకూరింది.  రెండు రోజుల క్రితం సర్వే నంబర్  83/1 లోని 6 ఎకరాల 29 గుంటల భూమికి ఈ-వేల నిర్వహించిన సంగతి తెలిసిందే. మొత్తం 6 ఎకరాల 9 గుంటలు రూ. 1490.73 కోట్లు పలికింది. దీన్ని గౌర వెంచర్స్‌ దక్కించుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement