బిహార్‌లో బీజేపీకి పట్టిన గతే బాబుకూ..: బైరెడ్డి | bai reddy rajashekar reddy criticized the Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బిహార్‌లో బీజేపీకి పట్టిన గతే బాబుకూ..: బైరెడ్డి

Nov 8 2015 7:59 PM | Updated on Jul 18 2019 2:11 PM

బిహార్‌లో బీజేపీకి పట్టిన గతే బాబుకూ..: బైరెడ్డి - Sakshi

బిహార్‌లో బీజేపీకి పట్టిన గతే బాబుకూ..: బైరెడ్డి

బీహార్ ఎన్నికల్లో బీజేపీకి పట్టిన గతే సీఎం చంద్రబాబుకు రాష్ట్రంలో పడుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు.

బీహార్ ఎన్నికల్లో బీజేపీకి పట్టిన గతే సీఎం చంద్రబాబుకు రాష్ట్రంలో పడుతుందని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కర్నూలులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమను పట్టిసీమతో సస్యశ్యామలం చేస్తానని సీఎం పదే పదే అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.

అబద్ధాన్ని నిజం అని నమ్మించడం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఒకే విధంగా చూడాల్సిన ప్రభుత్వం.. సీమపై వివక్ష చూపుతోందని విమర్శించారు. కరువు పరిస్థితుల్లో సీమ వాసులు నీరు దొరకక అల్లాడుతుంటే.. కోస్తా ఆయకట్టు కోసం శ్రీశైలం నీటిని తరలించుకుపోవడం దారుణమన్నారు. సీమ ప్రాజె క్టులను గాలికి వదిలేసి అధికార పార్టీ నేతలకు కమీషన్లు వచ్చే ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నారని మండిపడ్డారు. సీమ కరువుపై వచ్చే నెలలో యాత్ర చేపడుతున్నట్లు బైరెడ్డి తెలియ జేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement