విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి | B.Tech student dies of current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి

Apr 12 2015 12:46 PM | Updated on Sep 3 2017 12:13 AM

విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి

విద్యుదాఘాతంతో బీటెక్ విద్యార్థి మృతి

ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదువుతున్నవిద్యార్థి మృతి చెందాడు.

వైఎస్సార్ జిల్లా: ప్రమాదవశాత్తూ విద్యుదాఘాతానికి గురై ఇంజనీరింగ్ మూడో ఏడాది చదువుతున్నవిద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన గౌరినాథ్ (22) కేఓఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో ఏడాది చదువుతున్నాడు. కాగా, గాలులతో కూడిన  అకాల వర్షాలతో పంట పొలంలో ఉన్న పట్టాలు కొట్టుకొనిపోవటంతో వాటిని తెచ్చేందుకు వెళ్లాడు.

అయితే ప్రమాదవశాత్తూ ఈదురుగాలులకు తెగిపడి ఉన్న కరెంట్ తీగలు కాలికి తగిలి షాక్తో మృతిచెందాడు. దీంతో గ్రామస్తులు ట్రాన్స్కో అధికారులకు సమాచారం అందించేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో మండలంలోని సబ్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
(పెండ్లిమర్రి)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement