రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి | B.Tech student dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

May 28 2016 5:54 PM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందాడు.

అరకులోయ (విశాఖ) : వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతిచెందాడు. ఈ సంఘటన విశాఖ జిల్లా అరకులోయలో శనివారం చోటుచేసుకుంది. అరకు లోయ నుంచి విశాఖ వెళ్తున్న స్కార్పియో వాహనం ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న వేద సాయితరుణ్(21) అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు విజయవాడ వి.ఆర్. సిద్దార్థ్ కళాశాలలో బీటెక్ సెంకండియర్ చదువుతున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement