ఆటోడ్రైవర్‌ దారుణ హత్య | Auto Driver Brutal Murder | Sakshi
Sakshi News home page

ఆటోడ్రైవర్‌ దారుణ హత్య

Jun 16 2018 8:42 AM | Updated on Jun 16 2018 8:43 AM

Auto Driver Brutal Murder - Sakshi

మృతుడు మహేష్‌

కర్నూలు : స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్‌ హాల్‌ సందులో శుక్రవారం ఆటోడ్రైవర్‌ మహేష్‌ (28)ను దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం రత్నపల్లెకు చెందిన మహేష్‌ తండ్రి హనుమంతు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కర్నూలుకు వలస వచ్చారు. పి.వి.నరసింహారావు నగర్‌లో తండ్రి, టీవీ9 ప్రజానగర్‌ కాలనీలో మహేష్‌ ఉండేవారు. మహేష్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య హైమావతికి ఇద్దరు కుమార్తెలున్నారు.

మగ సంతానం కోసం మేరీని వివాహం చేసుకోవడంతో ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు. నగరానికి చెందిన ఆటోడ్రైవర్లు బాబు, ఖాలీషాతో కలసి గురువారం రాత్రి నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని రోహిత్‌ వైన్స్‌లో మద్యం సేవిస్తుండగా పక్క టేబుల్‌లో మద్యం సేవిస్తున్న వారితో మాటామాటా పెరిగి ఘర్షణ పడ్డారు. మద్యం దుకాణంలో నుంచి మహేష్‌ బయటకు వచ్చిన తర్వాత భరత్‌ అనే వ్యక్తి మరికొంతమంది స్నేహితులను పిలిపించి దేవీ ఫంక్షన్‌ హాల్‌ సందులోకి తీసుకెళ్లి ఇనుప రాడ్లతో బాది పారిపోయారు.

స్థానికులు మహేష్‌ను ఆసుపత్రిలో చేర్పించారు.  శుక్రవారం ఉదయం బంధువులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నారు. కోలుకోలేక మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. మూడో పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఐ మల్లికార్జున  సిబ్బందితో మద్యం దుకాణంతో పాటు ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement