బస్సును ఢీకొన్న ఆటో | Auto-bus a collision | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న ఆటో

Feb 7 2016 4:38 AM | Updated on Sep 3 2017 5:04 PM

బస్సును ఢీకొన్న ఆటో

బస్సును ఢీకొన్న ఆటో

పట్టణంలోని హౌసింగ్ బోర్డు సమీపంలో శనివారం రాత్రి బస్సు ను ఆటో ఢీకొనడంతో ఐదుగురు తీవ్రం గా గాయపడ్డారు.

 శ్రీకాళహస్తి: పట్టణంలోని హౌసింగ్ బో ర్డు సమీపంలో శనివారం రాత్రి బస్సును ఆటో ఢీకొనడంతో ఐదుగురు తీవ్రం గా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు ఆటో ప్రయాణికులను ఎక్కించుకుని శ్రీకాళహస్తి నుంచి తొండవునాడు మీదుగా ఏర్పేడు వుండలంలోని బండారుపల్లి గ్రావూనికి బయలుదేరింది. హౌ సింగ్ బోర్డు వద్ద తిరుపతి నుంచి శ్రీకాళహస్తికి వస్తున్న బస్సును ఢీకొంది.

శ్రీకాళహస్తి వుండలంలోని టీఎంవీకండ్రిగకు చెందిన జయుంతి(39), పుల్లారెడ్డికండ్రిగకు చెందిన అవుు్మలు(51), రాజయ్యు(55), ఏర్పేడు వుండలానికి చెందిన చెంగల్రాయుల్(45), పట్టణంలోని ప్రాజెక్టు వీధికి చెందిన ఆటో డ్రైవర్ సాధమ్ హుస్సేన్ (34) తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు 108 ద్వారా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథవు చికిత్స అనంతరం వారిని వైద్యులు తిరుపతి రూయూ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement