ఉద్యోగిపై తెలుగు తమ్ముళ్ల దాడి | attack on bill collector | Sakshi
Sakshi News home page

ఉద్యోగిపై తెలుగు తమ్ముళ్ల దాడి

Sep 13 2015 2:47 PM | Updated on Aug 24 2018 2:36 PM

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో పంచాయతీ ఉద్యోగిపై గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాడికి పాల్పడ్డాడు. బిల్ కలెక్టర్ నర్రా శ్రీనివాసరావు ఆదివారం పంచాయతీ కార్యాలయంలో ఉండగా... టీడీపీ స్థానిక అధ్యక్షుడు పులుకూరి రంగ విచక్షణా రహితంగా కొట్టారు.

గుంటూరు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామంలో పంచాయతీ ఉద్యోగిపై గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాడికి పాల్పడ్డాడు. బిల్ కలెక్టర్ నర్రా శ్రీనివాసరావు ఆదివారం పంచాయతీ కార్యాలయంలో ఉండగా... టీడీపీ స్థానిక అధ్యక్షుడు పులుకూరి రంగ విచక్షణా రహితంగా కొట్టారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిని కూడా చితక బాదాడు. తమపై రంగ అకారణంగా చేయి చేసుకున్నాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దాడికి గల కారణాలు తెలియ రాలేదు.

 

Advertisement
 
Advertisement
Advertisement