సామాన్య భక్తులతో కలసి దర్శనం | Army Chief Bipin Rawat worships at Lord Balaji temple | Sakshi
Sakshi News home page

సామాన్య భక్తులతో కలసి దర్శనం

Mar 9 2017 11:34 PM | Updated on Sep 5 2017 5:38 AM

సామాన్య భక్తులతో కలసి దర్శనం

సామాన్య భక్తులతో కలసి దర్శనం

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గురువారం నిరాడంబరంగా దర్శించుకున్నారు.

సుపథం మార్గంలో శ్రీవారిని దర్శించుకున్న ఆర్మీ చీఫ్‌
తిరుపతి(అలిపిరి): తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇండియన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గురువారం నిరాడంబరంగా దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా సామాన్య భక్తులతో కలసి సుపథం మార్గంలో ప్రత్యేక ప్రవేశ దర్శనం చేసుకున్నారు. రావత్‌ కుటుంబం, జవాన్లు ముందస్తుగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు పొందారు. సామాన్య భక్తులతో పాటుగా ముందుకు కదిలిన రావత్‌ ఆలయంలోని శ్రీవారి సేవకులను పలకరించారు. తిరుమల జేఈవో శ్రీనివాస రాజు, అదనపు సీవీఅండ్‌ఎస్‌వో శివకుమార్‌రెడ్డిలు శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రావత్‌ దంపతులకు రంగనాయకుల మండపంలో అర్చకుల ఆశీర్వచనాల నడుమ శ్రీవారి చిత్రపటం, తీర్ధప్రసాదాలను అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement