ఏపీలో 13 వర్సిటీల పాలకమండళ్లు రద్దు | AP Government Orders Abolishing Universities' Governing Bodies | Sakshi
Sakshi News home page

ఏపీలో 13 వర్సిటీల పాలకమండళ్లు రద్దు

Jun 28 2019 5:21 PM | Updated on Jun 28 2019 6:55 PM

AP Government Orders Abolishing Universities' Governing Bodies - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రాష‍్ట్ర ప్రభుత్వం శుక్రవారం రద్దు చేసింది. రద్దు అయిన వాటిలో తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ, కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం, విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం, ఆచార్యనాగార్జునా విశ్వవిద్యాలయం, నెల్లూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం, కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయం, మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం, అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీ, శ్రీకాకుళంలోని బీఆర్అంబేద్కర్ యూనివర్సిటీలతో పాటు  పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్టీయూలు ఉన్నాయి. ఇప్పుడున్న మండళ్లు గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియమించినవి. ఈ మేరకు ఉన్నత విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement