సీబీఐకి సుగాలి ప్రీతిబాయ్‌ కేసు: ఏపీ ప్రభుత్వం

AP Government Handed Over Sugali Preethi Bai Case To The CBI - Sakshi

సాక్షి, కర్నూలు: రాష్ట్ర వ్యాప్తంగా 2017లో సుగాలి ప్రీతి బాయ్‌ కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసులో పురోగతి వచ్చింది. ప్రీతిబాయ్‌ కేసును సీబీఐ అప్పగిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురువారం జీ.ఓ నెంబర్‌ 37ను విడుదల చేసింది. 2017 ఆగస్టు 19న కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని ప్రీతిబాయ్ మృతి చెందిన విషయం తెలిసిందే. స్కూల్‌ యాజమాన్యమే అత్యాచారం చేసి, తమ బిడ్డను హత్య చేసిందని ప్రీతిబాయ్‌ తల్లిదండ్రులు ఆరోపించారు. (మృగాళ్లకు మాండ్ర శివానందరెడ్డి అండ ..)

ఇటీవల ప్రీతిబాయ్‌ తల్లిదండ్రులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి ప్రీతిబాయ్‌ కేసును సీబీఐ అప్పగించాలని కోరారు. వారికి సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ప్రీతి కేసును సీబీఐకి అప్పగించింది.  ఈ కేసును సీబీఐకి అప్పగించడంపై ప్రీతిబాయ్‌ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top