ఏపీలో ఇంటర్ పరీక్షలు సొంతంగానే! | AP Government conducts inter exams, says Ganta Srinivasarao | Sakshi
Sakshi News home page

ఏపీలో ఇంటర్ పరీక్షలు సొంతంగానే!

Dec 6 2014 2:58 AM | Updated on Aug 18 2018 8:05 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 11 నుంచి నిర్వహించాలని  ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం


సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 11 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడిగా ఈ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు చేసిన యత్నం ఫలించలేదు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియెట్‌కు ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేసుకుంది. దీంతో తాము సొంతంగగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి గంటా శ్రీనివాసరావు ‘సాక్షి’కి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement