
సాక్షి, అనంతపురం : అసెంబ్లీలో చారిత్రక బిల్లులను ఆమోదించినందుకు గర్వపడుతున్నానని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శక పాలన అందించి.. ఇచ్చిన హామీలను నేరవేరుస్తున్నారని కొనియాడారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆలయ భూములను ఆక్రమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ స్పీకర్ హెచ్చరించారు. బ్రాహ్మాణుల సంక్షేమానికి సీఎం జగన్ పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ దేశంలోనే ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని చెప్పారు. ఆలయాల్లో దూపదీప నైవేద్యాలకు 235 కోట్లు కేటాయించటం అభినందనీయమని అన్నారు.