చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం | AP cm chandrababu elected for ideal chief minister award which was given by indian students parliament | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం

Jan 25 2016 8:28 PM | Updated on Aug 18 2018 6:11 PM

చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం - Sakshi

చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి పురస్కారం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ 'ఆదర్శ ముఖ్యమంత్రి' అవార్డుకు ఎంపికయ్యారు.

విజయవాడ బ్యూరో: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ 'ఆదర్శ ముఖ్యమంత్రి' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ నెల 30న పూణెలో జరిగే ఆరో ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్ కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నట్లు సీఎం కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. మరో ప్రకటనలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా సీఎం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, గణతంత్ర ప్రజాస్వామ్య రాజ్యంగా రూపొందించేందుకు కృషి చేసిన మహనీయులను కొనియాడారు. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత 2015లో పూర్తికాలం మన రాష్ట్రం నుంచే పాలనా కార్యకలాపాలు కొనసాగించడం ఘన విజయమన్నారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు దేశంలోనూ, ప్రపంచంలోనూ రాష్ట్రానికి ఒక కొత్త గుర్తింపు సాధించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement