బ్యాంకు మేనేజర్‌ ఇంట్లో చోరీ | andrabank employe house theft in vishkapatnam | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్‌ ఇంట్లో చోరీ

Feb 3 2015 10:37 PM | Updated on Sep 2 2017 8:44 PM

విశాఖపట్నం మద్దిలపాలెం ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది.

విశాఖపట్నం: విశాఖపట్నం మద్దిలపాలెం ప్రాంతంలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. డాక్టర్ వీఎస్.కృష్ణా కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న ఆంధ్రాబ్యాంకు జనరల్ ఇన్సూరెన్స్ మేనేజర్‌ అనిల్ కుమార్ ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు. బీరువాలో ఉన్న 18 తులాల బంగారం, 3.5 కిలోల వెండి వస్తువులు, రూ.90 వేల నగదు చోరీకి గురయ్యాయని తెలుసుకుని ఆయన ఎంవీపీ కాలనీ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

అనిల్ కుమార్ ఈ నెల 1న అనకాపల్లి వెళ్లి మంగళవారం సాయంత్రం తిరిగి తన ఇంటికి చేరుకున్నారు. ఇంటి తాళం బద్దలు కొట్టి ఉండడం... లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరచి ఉండడాన్ని చూసి దోపిడీ జరిగినట్టు గుర్తించారు.  పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement